Thursday, 12 November 2026

బాలకాండము భాగము - 2

 

బాలకాండము భాగము - 2

 

ఈ కాండములో సర్గ సంఖ్య

శ్లోకములు

శ్లోకముల సంఖ్య

ఈ కాండములో స్వీకరించిన మొత్తము శ్లోకములు

7

 

 

 

 

8


18

తైర్మంత్రిభిర్మంత్రహితే నివిష్టైః

వృతోఽనురక్తైః కుశలైః సమర్థైః |

స పార్థివో దీప్తిమవాప యుక్తః

తేజోమయైర్గోభిరివోదితోఽర్కః ||౧||

తస్య చైవంప్రభావస్య ధర్మజ్ఞస్య మహాత్మనః |

సుతార్థం తప్యమానస్య నాసీద్వంశకరః సుతః ||౨||

చైత్రమాసే తతశ్చైవ నావమిక్యామ్ తిథౌ తథా ।

నక్షత్రేఽదితిదైవత్యే స్వోచ్చసంస్థేషు పఞ్చసు ॥౩||

గ్రహేషు కర్కటే లగ్నే వాక్పతావిందునా సహ |

ప్రోద్యమానే జగన్నాథం సర్వలోకనమస్కృతమ్ ||౪ ||

కౌసల్యాజనయద్రామం దివ్యలక్షణసంయుతమ్ |

శక్రారర్ధం మహాభాగం పుత్రమిక్ష్వాకునన్దనమ్ || ౫||

కౌసల్యా శుశుభే తేన పుత్రేణామితతేజసా |

యథా వరేణ దేవానామదితిర్వజ్రపాణినా ||౬ ||

భరతో నామ కైకేయ్యాం జజ్ఞే సత్యపరాక్రమః |

అథ లక్ష్మణశత్రుఘ్నౌ సుమిత్రాజనయత్సుతౌ ||౭||

పుష్యే జాతస్తు భరతో మీనలగ్నే ప్రసన్నధీః |

సార్పే జాతౌ తు సౌమిత్రీ కుళీరేఽభ్యుదితే రవౌ ||౮||

రాజ్ఞః పుత్రా మహాత్మానశ్చత్వారో జజ్ఞిరే పృథక్ |

గుణవన్తోఽనురూపాశ్చ రుచ్యా ప్రోష్ఠపదోపమాః ||౯||

అతీత్యైకాదశాహం తు నామ కర్మ తథాకరోత్ |

జ్యేష్ఠం రామం మహాత్మానం భరతం కైకయీసుతమ్ || ౧౦||

సౌమిత్రిం లక్ష్మణమితి శత్రుఘ్నమపరం తథా |

వసిష్ఠః పరమప్రీతో నామాని కృతవాంస్తదా |

 బ్రాహ్మణాన్భోజయామాస పౌరాఞ్జానపదానపి||౧౧||

అదదాద్బ్రహ్మణానాం చ రత్నౌఘమమితం బహు

తేషాం జన్మక్రియాదీని సర్వకర్మాణ్యకారయత్ ||౧౨||

తేషాం కేతురివ జ్యేష్ఠో రామో రతికరః పితుః |

బభూవ భూయో భూతానాం స్వయమ్భూరివ సంమతః || ౧౩||

సర్వే వేదవిదః శూరాః సర్వే లోకహితే రతాః |

సర్వే జ్ఞానోపసమ్పన్నాః సర్వే సముదితా గుణైః || ౧౪||

తేషామపి మహాతేజా రామః సత్యపరాక్రమః |

బాల్యాత్ప్రభృతి సుస్నిగ్ధో లక్ష్మణో లక్ష్మివర్ధనః || ౧౫||

రామస్య లోకరామస్య భ్రాతుర్జ్యేష్ఠస్య నిత్యశః |

సర్వప్రియకరస్తస్య రామస్యాపి శరీరతః || ౧౬||

లక్ష్మణో లక్ష్మిసమ్పన్నో బహిఃప్రాణ ఇవాపరః |

న చ తేన వినా నిద్రాం లభతే పురుషోత్తమః |

మృష్టమన్నముపానీతమశ్నాతి న హి తం వినా || ౧౭||

యదా హి హయమారూఢో మృగయాం యాతి రాఘవః |

తదైనం పృష్ఠతోఽభ్యేతి సధనుః పరిపాలయన్ || ౧౮||

భరతస్యాపి శత్రుఘ్నో లక్ష్మణావరజో హి సః |

ప్రాణైః ప్రియతరో నిత్యం తస్య చాసీత్తథా ప్రియః || ౧౯||

స చతుర్భిర్మహాభాగైః పుత్రైర్దశరథః ప్రియైః |

బభూవ పరమప్రీతో దేవైరివ పితామహః || ౨౦||

తే యదా జ్ఞానసమ్పన్నాః సర్వే సముదితా గుణైః |

హ్రీమన్తః కీర్తిమన్తశ్చ సర్వజ్ఞా దీర్ఘదర్శినః || ౨౧||

అథ రాజా దశరథస్తేషాం దారక్రియాం ప్రతి |

చిన్తయామాస ధర్మాత్మా సోపాధ్యాయః సబాన్ధవః || ౨౨||

తస్య చిన్తయమానస్య మన్త్రిమధ్యే మహాత్మనః |

అభ్యాగచ్ఛన్మహాతేజో విశ్వామిత్రో మహామునిః || ౨౩||

స రాజ్ఞో దర్శనాకాఙ్క్షీ ద్వారాధ్యక్షానువాచ హ |

శీఘ్రమాఖ్యాత మాం ప్రాప్తం కౌశికం గాధినః సుతమ్ || ౨౪||

తచ్ఛ్రుత్వా వచనం తస్య రాజవేశ్మ ప్రదుద్రువుః |

సమ్భ్రాన్తమనసః సర్వే తేన వాక్యేన చోదితాః || ౨౫||

తే గత్వా రాజభవనం విశ్వామిత్రమృషిం తదా |

ప్రాప్తమావేదయామాసుర్నృపాయేక్ష్వాకవే తదా || ౨౬||

తేషాం తద్వచనం శ్రుత్వా సపురోధాః సమాహితః |

ప్రత్యుజ్జగామ సంహృష్టో బ్రహ్మాణమివ వాసవః || ౨౭||

స దృష్ట్వా జ్వలితం దీప్త్యా తాపసం సంశితవ్రతమ్ |

ప్రహృష్టవదనో రాజా తతోఽర్ఘ్యముపహారయత్ || ౨౮||

స రాజ్ఞః ప్రతిగృహ్యార్ఘ్యం శాస్త్రదృష్ట్తేన కర్మణా |

కుశలం చావ్యయం చైవ పర్యపృచ్ఛన్నరాధిపమ్ || ౨౯||

వసిష్ఠం చ సమాగమ్య కుశలం మునిపుఙ్గవః |

ఋషీంశ్చ తాన్యథా న్యాయం మహాభాగానువాచ హ || ౩౦||

తే సర్వే హృష్టమనసస్తస్య రాజ్ఞో నివేశనమ్ |

వివిశుః పూజితాస్తత్ర నిషేదుశ్చ యథార్థతః || ౩౧||

అథ హృష్టమనా రాజా విశ్వామిత్రం మహామునిమ్ |

ఉవాచ పరమోదారో హృష్టస్తమభిపూజయన్ || ౩౨||

యథామృతస్య సమ్ప్రాప్తిర్యథా వర్షమనూదకే |

యథా సదృశదారేషు పుత్రజన్మాప్రజస్య చ |

ప్రనష్టస్య యథా లాభో యథా హర్షో మహోదయే |

తథైవాగమనం మన్యే స్వాగతం తే మహామునే || ౩౩||

కం చ తే పరమం కామం కరోమి కిము హర్షితః |

పాత్రభూతోఽసి మే విప్ర దిష్ట్యా ప్రాప్తోఽసి ధార్మిక |

అద్య మే సఫలం జన్మ జీవితం చ సుజీవితమ్ || ౩౪||

పూర్వం రాజర్షిశబ్దేన తపసా ద్యోతితప్రభః |

బ్రహ్మర్షిత్వమనుప్రాప్తః పూజ్యోఽసి బహుధా మయా || ౩౫||

తదద్భుతమిదం విప్ర పవిత్రం పరమం మమ |

శుభక్షేత్రగతశ్చాహం తవ సన్దర్శనాత్ప్రభో || ౩౬||

బ్రూహి యత్ప్రార్థితం తుభ్యం కార్యమాగమనం ప్రతి |

ఇచ్ఛామ్యనుగృహీతోఽహం త్వదర్థపరివృద్ధయే || ౩౭||

కార్యస్య న విమర్శం చ గన్తుమర్హసి కౌశిక |

కర్తా చాహమశేషేణ దైవతం హి భవాన్మమ || ౩౮||

ఇతి హృదయసుఖం నిశమ్య వాక్యం

శ్రుతిసుఖమాత్మవతా వినీతముక్తమ్ |

ప్రథితగుణయశా గుణైర్విశిష్టః

పరమ ఋషిః పరమం జగామ హర్షమ్ || ౩౯||

39

73

రాజహితాన్ని కోరేవారూ, రాజుపై అమితమైన అనురాగం గలవారూ, సమర్థులూ అయిన ఆ మంత్రులతో కూడిన దశరథ మహారాజు, తేజోవంతమైన కిరణాలతో ఉదయించే సూర్యుని వలె ప్రకాశించాడు. అంతటి ప్రభావవంతుడు, ధర్మజ్ఞుడు, మహాత్ముడు అయిన ఆ రాజుకు వంశాన్ని నిలబెట్టే పుత్రుడు లేకపోవడం వల్ల, ఆయన సంతానం కోసం పరితపిస్తూ (ఉపాయం కోసం ఆలోచిస్తూ) ఉన్నాడు.

 

ఆ తర్వాత చైత్ర మాసము, శుక్లపక్ష నవమి తిథి నాడు, అదితి దేవతా నక్షత్రమైన పునర్వసు నందు, ఐదు గ్రహాలు (సూర్యుడు, అంగారకుడు, గురుడు, శుక్రుడు, శని) తమ తమ ఉచ్ఛ స్థానాలలో ఉండగా, కర్కాటక లగ్నంలో బృహస్పతి చంద్రునితో కలిసి ఉదయించినప్పుడు... సర్వలోక పూజితుడు, జగన్నాథుడు అయిన శ్రీరాముడిని కౌసల్యాదేవి ప్రసవించింది. దివ్య లక్షణాలతో కూడిన, ఇంద్రుని అంతటి పరాక్రమశాలి అయిన ఆ పుత్రుని పొంది, కౌసల్య దేవతలలో శ్రేష్ఠుడైన ఇంద్రుడిని కన్న అదితి దేవి వలె అమితమైన తేజస్సుతో శోభిల్లింది.

 

కైకేయికి సత్య పరాక్రమవంతుడైన భరతుడు జన్మించాడు. సుమిత్రాదేవి లక్ష్మణ, శతృఘ్నులను ప్రసవించింది. భరతుడు పుష్యమి నక్షత్రము, మీన లగ్నంలో ప్రసన్నమైన బుద్ధితో జన్మించగా, సుమిత్ర కుమారులు ఆశ్లేష నక్షత్రంలో సూర్యుడు ఉదయించే సమయంలో జన్మించారు. గుణవంతులు, రూపవంతులైన ఆ నలుగురు కుమారులు పుట్టడం చేత దశరథుని వంశం పూర్వాభాద్ర, ఉత్తరాభాద్ర నక్షత్రాల వలె (ప్రోష్ఠపదములు) ప్రకాశించింది.

 

పదకొండు రోజులు గడిచిన తర్వాత వసిష్ఠ మహర్షి పరమ సంతోషంతో వారికి నామకరణం చేశాడు. జ్యేష్ఠుడికి 'రాముడు' అని, కైకేయి కుమారునికి 'భరతుడు' అని, సుమిత్ర కుమారులకు 'లక్ష్మణుడు' మరియు 'శతృఘ్నుడు' అని పేర్లు పెట్టాడు. ఆ సందర్భంగా బ్రాహ్మణులకు, నగర ప్రజలకు అన్నసంతర్పణ చేసి, అమితమైన రత్నరాసులను దానంగా ఇచ్చి, పుత్రుల జాతకర్మలన్నింటినీ శాస్త్రోక్తంగా జరిపించాడు.

 

ఆ నలుగురిలో జ్యేష్ఠుడైన రాముడు తన తండ్రికి ఎంతో ఆనందాన్ని ఇస్తూ, బ్రహ్మదేవుని వలె పూజింపబడ్డాడు. వారందరూ వేదవిదులు, శూరులు, లోక కల్యాణాన్ని కోరేవారే. వారిలో మహా తేజశ్శాలి అయిన రామునికి, ఐశ్వర్యవర్ధనుడైన లక్ష్మణుడు బాల్యం నుంచే అత్యంత ప్రియమైనవాడై ఉన్నాడు. లక్ష్మణుడు రామునికి బాహ్య ప్రాణం (శరీరం వెలుపల ఉన్న ప్రాణం) లాంటివాడు. రాముడు లక్ష్మణుడు లేకుండా నిద్రపోయేవాడు కాదు, ఎంత రుచికరమైన భోజనం తెచ్చినా లక్ష్మణుడు లేకుండా తినేవాడు కాదు.

 

రాముడు గుర్రాన్నెక్కి వేటకు వెళ్లినప్పుడల్లా, లక్ష్మణుడు ధనస్సు ధరించి ఆయనను రక్షిస్తూ వెనుకనే అనుసరించేవాడు. అలాగే లక్ష్మణుని తమ్ముడైన శతృఘ్నుడు, భరతునికి ప్రాణం కంటే ప్రియమైనవాడిగా మరియు అతనిని సేవించేవాడిగా ఉండేడు.

 

మహాభాగ్యవంతులైన ఆ నలుగురు కుమారులతో దశరథ మహారాజు, దేవతలతో కూడిన బ్రహ్మదేవుని వలె పరమ సంతోషాన్ని పొందాడు. ఆ కుమారులు సద్గుణాలతో, వినయంతో, కీర్తితో విరాజిల్లుతున్నప్పుడు, ధర్మాత్ముడైన దశరథుడు తన గురువులు, బంధువులతో కలిసి వారి వివాహాల (దారు క్రియల) గురించి ఆలోచించడం ప్రారంభించాడు.

 

రాజు మంత్రుల మధ్య ఆ విధంగా ఆలోచిస్తుండగా, మహా తేజస్వి అయిన విశ్వామిత్ర మహాముని అక్కడకు విచ్చేశాడు. ఆయన ద్వారపాలకులతో "గాధి కుమారుడైన విశ్వామిత్రుడు వచ్చాడని రాజుకు శీఘ్రంగా తెలియజేయండి" అని పలికాడు. ఆ మాట వినగానే ద్వారపాలకులు వేగంగా రాజభవనంలోకి పరుగెత్తి, దశరథునికి విశ్వామిత్ర మహర్షి రాకను నివేదించారు.

 

ఆ మాటలు విని, బ్రహ్మదేవుడిని ఎదుర్కొనే ఇంద్రుని వలె దశరథ మహారాజు పురోహితులతో కలిసి ఎంతో సంతోషంగా ఎదురెళ్లాడు. తపోదీక్షతో ప్రకాశిస్తున్న ఆ మునిని చూసి, రాజు ప్రసన్న వదనంతో శాస్త్రోక్తంగా అర్ఘ్యపాద్యాలను సమర్పించాడు. విశ్వామిత్రుడు కూడా రాజు యొక్క కుశల సమాచారాన్ని, ఆపై వసిష్ఠ మహర్షిని, ఇతర ఋషులను యథావిధిగా కుశలప్రశ్నలు అడిగాడు. వారంతా సంతోషంతో భవనంలోకి ప్రవేశించి, ఆసనాలలో కూర్చున్నారు.

 

అప్పుడు దశరథ మహారాజు సంతోషంతో విశ్వామిత్రుని పూజిస్తూ ఇలా పలికాడు: "మహామునీ! నీ రాక నాకు ఎలాంటి ఆనందాన్ని ఇచ్చిందంటే... అమృతం లభించినట్లు, వర్షాలు లేని చోట వర్షం కురిసినట్లు, సంతానం లేనివానికి పుత్రుడు జన్మించినట్లు, పోగొట్టుకున్న నిధి తిరిగి దొరికినట్లు ఉంది. మీ రాకతో ఈ రోజు నా జన్మ ధన్యమైంది, నా జీవితం సఫలమైంది. పూర్వం రాజర్షిగా ఉండి, తపస్సు చేత బ్రహ్మర్షిత్వాన్ని పొందిన మీరు నాకు బహుధా పూజ్యులు. ప్రభూ! మీరు ఏ కార్యం కోసం వచ్చారో ఆజ్ఞాపించండి. కౌశికా! మీ కార్యం నెరవేరుతుందో లేదో అని సందేహించకండి, నేను దానిని పూర్తిగా చేస్తాను, ఎందుకంటే మీరు నాకు దైవంతో సమానం".

 

వినయంతో పలికిన, చెవులకు ఇంపైన, హృదయానికి ఆనందాన్ని కలిగించే దశరథుని మాటలను విని, ఆ పరమ ఋషి అయిన విశ్వామిత్రుడు అమితమైన ఆనందాన్ని పొందాడు.

19

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 


20

 

 

తచ్ఛ్రుత్వా రాజసింహస్య వాక్యమద్భుతవిస్తరమ్ |

హృష్టరోమా మహాతేజా విశ్వామిత్రోఽభ్యభాషత || ౧||

సదృశం రాజశార్దూల తవైతద్భువి నాన్యతః |

మహావంశప్రసూతస్య వసిష్ఠవ్యపదేశినః || ౨||

యత్తు మే హృద్గతం వాక్యం తస్య కార్యస్య నిశ్చయమ్ |

కురుష్వ రాజశార్దూల భవ సత్యప్రతిశ్రవః || ౩||

అహం నియమమాతిష్ఠ సిద్ధ్యర్థం పురుషర్షభ |

తస్య విఘ్నకరౌ ద్వౌ తు రాక్షసౌ కామరూపిణౌ || ౪||

వ్రతే మే బహుశశ్చీర్ణే సమాప్త్యాం రాక్షసావిమౌ |

మారీచశ్చ సుబాహుశ్చ వీర్యవన్తౌ సుశిక్షితౌ |

తౌ మాంసరుధిరౌఘేణ వేదిం తామభ్యవర్షతామ్ || ౫||

అవధూతే తథా భూతే తస్మిన్నియమనిశ్చయే |

కృతశ్రమో నిరుత్సాహస్తస్మాద్దేశాదపాక్రమే || ౬||

న చ మే క్రోధముత్స్రష్టుం బుద్ధిర్భవతి పార్థివ |

తథాభూతా హి సా చర్యా న శాపస్తత్ర ముచ్యతే || ౭||

అభిప్రేతమసంసక్తమాత్మజం దాతుమర్హసి |

దశరాత్రం హి యజ్ఞస్య రామం రాజీవలోచనమ్ || ౮||

నాత్యేతి కాలో యజ్ఞస్య యథాయం మమ రాఘవ |

తథా కురుష్వ భద్రం తే మా చ శోకే మనః కృథాః || ౯||

ఇత్యేవముక్త్వా ధర్మాత్మా ధర్మార్థసహితం వచః |

విరరామ మహాతేజా విశ్వామిత్రో మహామునిః || ౧౦||

ఇత్యుక్తో మునినా తేన రాజోవాచ మునిం తదా |

స త్వం ప్రసాదం ధర్మజ్ఞ కురుష్వ మమ పుత్రకే |

దేవదానవగన్ధర్వా యక్షాః పతగ పన్నగాః || ౧౧||

కథమప్యమరప్రఖ్యం సఙ్గ్రామాణామ్ అకోవిదమ్ |

బాలం మే తనయం బ్రహ్మన్నైవ దాస్యామి పుత్రకమ్ || ౧౨||

అథ కాలోపమౌ యుద్ధే సుతౌ సున్దోపసున్దయోః |

యజ్ఞవిఘ్నకరౌ తౌ తే నైవ దాస్యామి పుత్రకమ్ || ౧౩||

మారీచశ్చ సుబాహుశ్చ వీర్యవన్తౌ సుశిక్షితౌ |

తయోరన్యతరేణాహం యోద్ధా స్యాం ససుహృద్గణః || ౧౪||

14

87

రాజశ్రేష్ఠుడైన దశరథుని అద్భుతమైన, ఉదారమైన మాటలను విని, మహా తేజశ్శాలి అయిన విశ్వామిత్ర మహర్షి ఒళ్ళు పులకరించి (హృష్టరోముడై) ఇలా పలికాడు: "రాజసింహమా! గొప్ప వంశంలో జన్మించి, వసిష్ఠ మహర్షి వంటి సద్గురువుల మార్గదర్శకత్వంలో ఉన్న నీకు మాత్రమే ఇటువంటి (ధార్మిక) మాటలు పలకడం సాధ్యం. భూమిపై మరెవ్వరికీ ఇది సాధ్యం కాదు."

 

"రాజశ్రేష్ఠుడా! నా హృదయంలో ఉన్న కోరికను విను. ఆ కార్యాన్ని నెరవేరుస్తానని నిశ్చయించుకుని, నీ సత్యప్రతిజ్ఞను నిలబెట్టుకో. పురుషోత్తమా! నేను ఒక యజ్ఞ సిద్ధి కోసం దీక్షను (నియమాన్ని) స్వీకరించాను. కానీ, రూపాలను మార్చగల (కామరూపులైన) ఇద్దరు రాక్షసులు ఆ యజ్ఞానికి విఘ్నం కలిగిస్తున్నారు."

 

"నేను ఎంతో శ్రమతో చేసిన ఆ వ్రతం (యజ్ఞం) ముగింపు దశకు వచ్చేసరికి... పరమ పరాక్రమవంతులు, యుద్ధ విద్యలలో చక్కగా శిక్షణ పొందిన మారీచుడు, సుబాహువు అనే ఇద్దరు రాక్షసులు యజ్ఞవేదికపై మాంసము, రక్తముల వర్షాన్ని కురిపిస్తున్నారు. ఆ విధంగా నా యజ్ఞ దీక్ష భంగం కావడంతో, చేసిన శ్రమ అంతా వృథా అయి, నిరుత్సాహపడి నేను ఆ ప్రదేశం నుండి వెనుదిరిగాను."

 

"రాజా! యజ్ఞ దీక్షలో ఉన్నప్పుడు ఎవరిపైనా క్రోధాన్ని (కోపాన్ని) ప్రదర్శించకూడదు, ఆ సమయంలో ఎవరికీ శాపం ఇవ్వకూడదు అనేది నియమం. అందుకే నేను వారిని శపించలేదు. కావున, నువ్వు నీ జ్యేష్ఠ కుమారుడు, పద్మపత్రాక్షుడు (తామర రేకుల వంటి కన్నులు గలవాడు) అయిన రాజీవలోచనుడైన శ్రీరాముడిని నా యజ్ఞ రక్షణ కోసం పది రోజులు (దశరాత్రం) నాతో పంపవలసిందిగా కోరుతున్నాను."

 

"రాఘవా! నా యజ్ఞ సమయం మించిపోకుండా ఉండేలా త్వరగా నిర్ణయం తీసుకో. నీకు శుభం కలుగుతుంది, మనస్సులో ఎటువంటి శోకానికి (చింతకు) తావివ్వకు." ధర్మము, అర్థములతో కూడిన ఈ మాటలను పలికి మహా తేజస్వి అయిన విశ్వామిత్ర మహాముని మౌనం వహించాడు.

 

ముని ఆ విధంగా పలికినప్పుడు, దశరథ మహారాజు ఎంతో భయపడి ఇలా బదులిచ్చాడు: "ధర్మజ్ఞుడవైన ఓ మహర్షీ! నా చిన్న కుమారునిపై దయ ఉంచండి. దేవతలు, దానవులు, గంధర్వులు, యక్షులు, పక్షులు, సర్పాలు ఎదిరించినా... ఇంకా యుద్ధ రంగంలో ఎటువంటి అనుభవం లేని (సంగ్రామ అకోవిదుడు), దేవకుమారుని వంటి బాలడైన నా ప్రాణసమానుడైన రాముడిని నేను ఇవ్వలేను."

 

ఇత్యార్షే శ్రీ మూల రామాయణే బాలకాండే ద్వితీయ: భాగ:

No comments:

Post a Comment